గాంధీనగర్: కరోనా కేసులు పెరుగుతున్న నేపథయంలో గుజరాత్ లో రాత్రి కర్ఫ్యూను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 4 వరకు పొడిగించింది. గాంధీనగర్‌లో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 27 నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. రాత్రి కర్ఫ్యూ సమయం రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
Mon Jan 19, 2015 06:51 pm