హైదరాబాద్ : భారత్ బోటును పాకిస్థాన్ హైజాక్ చేసినట్టుగా తెలుస్తోంది. బోటులో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు జాలర్లను పాకిస్థాన్ కు చెందిన పలువురు కిడ్నాప్ చేశారు. పూర్తి వివరాల్లోకెళ్తే.. గుజరాత్లోని ఓఖా తీరం నుంచి ఈనెల 18న తులసీ మైయా అనే బోటులో ఏడుగురు జాలర్లు చేపల వేటకు వెళ్లారు. అయితే కొద్ది రోజులకు ఆ బోటు ఇంజిన్ పాడవడంతో జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పాకిస్థాన్కు చెందిన కొందరు బోటును హైజాక్ చేసినట్టు తెలిసింది. శుక్రవారం మధ్యాహ్నం తర్వాత సముద్రంలో చిక్కుకున్న ఆ బోటు నుంచి ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. చివరగా ఆ బోటు యజమాని, జాలర్లతో మాట్లాడామని.. అయిత బోటు పాకిస్థాన్ వైపుగా వెళ్తున్నట్టు వారు తెలిపారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm