హైదరాబాద్: సీఎం కేసీఆర్‌పై సీబీఐ డైరెక్టర్‌కు కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌పై అమిత్ షాకు కూడా ఫిర్యాదు చేశానని కేఏ పాల్ తెలిపారు. దేశంలో కుటుంబ పాలనను అంతం చేయాలన్నారు. కేటీఆర్ దాదాగిరీ ఇకపై చెల్లదన్నారు. ఏపీ, తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడి చేసినవాడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అలాగే పోలీస్ అధికారులపై చర్యలెందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm