హైదరాబాద్ : ఐపీఎల్ తాజా సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. టాస్ నెగ్గిన కోల్‌కతా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోగా...హైదరాబాద్ ఫీల్డింగ్‌కు దిగనుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు కోల్ కతా కూడా కూడా ఈ మ్యాచ్ కీలకం కానుంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
ఇప్పటిదాకా హైదరాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 5 విజయాలతో 10పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. అదే సమయంలో ఇప్పటికే 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా 5 విజయాలతో 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇరు జట్ల ఖాతాలో 10 పాయింట్లే ఉన్నా... నెట్ రన్ రేటు అధికంగా కలిగిన హైదరాబాద్ జట్టు కోల్ కతా కంటే ఒ మెట్టు పైన ఉంది. ఈ మ్యాచ్‌లో విజయంతో హైదరాబాద్‌కు ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగు కానున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే కోల్ కతాకు ప్లే ఆఫ్ అవకాశాలు మరింతగా సన్నగిల్లనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 May,2022 07:25PM