హైదరాబాద్ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. గవర్నర్‌కు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. తొలుత ధ్వజస్తంభానికి నమస్కరించి, ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో గవర్నర్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఈవో తీర్థప్రసాదాలు అందజేశారు. అంతకుముందు తిరుమల పద్మావతి వసతి గృహం వద్దకు చేరుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు రమేశ్‌బాబు, హరీంద్రనాథ్, ఆర్డీవో కనక నర్సారెడ్డి, వీజీవో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm