హైదరాబాద్ : సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న నితీష్ రాణా (26) పెవిలియన్ చేరాడు. ఉమ్రాన్ మాలిక్ వేసిన 8వ ఓవర్ మూడో బంతికి అతను పెవిలియన్ చేరాడు. మాలిక్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రాణా.. డీప్ స్క్వేర్ లెగ్‌లో శశాంక్ సింగ్‌కు చిక్కాడు. ఆఫ్ స్టంప్ ఆవల ఉమ్రాన్ వేసిన షార్ట్ బాల్‌ను బలంగా పుల్ చేయలేకపోయాడు రాణా. దీంతో శశాంక్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. దీంతో 65 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్లో అజింక్య రహానే (28)ని కూడా ఉమ్రాన్ అవుట్ చేశాడు. 83 పరుగుల వద్ద శ్రేయస్ అయ్యర్ (15) ఉమ్రాన్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. తర్వతా వచ్చిన రింకూ సింగ్ (5) 94 పరుగుల వద్ద నటరాజన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm