హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. రజాకార్ల ఒడిలో కూర్చున్న వారిని గద్దెదించేందుకు ఈ యాత్ర చేపట్టామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్ధ సీఎంను చూడలేదని, బాయిల్డ్ రైస్ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. కేసీఆర్ చెప్పినట్లు బంగారు తెలంగాణ అయిందా? అని అమిత్‌షా ప్రశ్నించారు. తెలంగాణలో కేంద్ర పథకాల పేర్లు మార్చడమే కానీ చేసిందేమీలేదన్నారు. కేంద్రం ఇచ్చిన సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలుచేయాలని, వరంగల్ సైనిక్ స్కూల్‌కు 2016లో అనుమతి ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదని షా చెప్పారు. తెలంగాణకు ఎనిమిదేళ్లలో రూ.2.52 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా తెలిపారు. కేసీఆర్‌కు అమిత్‌షా సవాల్ విసిరారు. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అమిత్‌షా స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ప్రతి గింజా కొంటామని తెలిపారు. తన మాటలు వింటుంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని అమిత్‌షా అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm