హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెట్ ప్రేమికులకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ లెజెండరీ క్రికెటర్, మాజీ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (46) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. టౌన్స్‌విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో సైమండ్స్ ప్రాణాలు కోల్పోయాడు. సైమండ్స్ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఆసిస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అకాల మృతితో బాధపడుతున్న ఆ జట్టు అభిమానులకు సైమండ్స్ మృతి వారిని శోకసంద్రంలో ముంచింది. సైమండ్స్ మృతి పట్ల ప్రముఖులు, మాజీ ఆటగాళ్లు, క్రీడాభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm