చెన్నై: రాష్ట్రంలో 16 జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ పరిశోధనా కేంద్రం అధికారులు శనివారం ఒక ప్రకటన జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా కన్నియకుమారి, తిరునెల్వేలి, తెన్కాశి, తేని, దిండిగల్, తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, కరూర్, నామక్కల్, సేలం, తిరుచ్చి, అరియలూరు, పెరంబలూరు, పుదుక్కోట్టై, ఈరోడ్ సహా 16 జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షం కురవచ్చని పేర్కొంది. 16న నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తేని, దిండిగల్, ఈరోడ్, సేలం, నామక్కల్, కరూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, 17న నీలగిరి, ఈరోడ్, కృష్ణగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, దిండిగల్, తేని జిల్లాల్లో ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షంపడే సూచనలు ఉన్నాయని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm