హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. కొవిడ్ సోకడంతో ఈ నెల 17న ప్రారంభం కానున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కరోనా సోకిన విషయాన్ని ట్వీట్ చేస్తూ.. కేన్స్ 2022 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తనకు కరోనా సోకిందని, దీంతో విశ్రాంతి తీసుకుంటున్నానని రాసుకొచ్చాడు. కేన్స్‌ను తాను నిజంగా మిస్సవుతున్నట్టు పేర్కొన్న అక్షయ్.. కేన్స్ ఫెస్టివల్‌లో పాల్గొనే భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు.
Mon Jan 19, 2015 06:51 pm