నారాయణపేట: జిల్లాలోని ఉట్కూర్ మండలంలో పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను మేపుకు వదిలి పొలం దగ్గరే కట్టేశాడు. అయితే శనివారం రాత్రి 9 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో అవి రెండూ మరణించాయి. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ఎద్దులు రెండూ మృతి చెంది ఉండటంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వాటి విలువ రూ. లక్ష 80 వేలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై స్థానిక తాసిల్దార్ తిరుపతయ్యకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm