హైదరాబాద్ : అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు. దిమా హసావ్ జిల్లాలోని 12 గ్రామాల్లో కొంచరియలు విరిగిపడ్డాయి. వరదల ధాటికి హాఫ్లాంగ్ ప్రాంతంలో ముగ్గురు మృతిచెందగా, 80 ఇండ్లు దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో రోడ్డు కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి హాజయ్ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్రంలోని కాచర్, ధెమాజి, హొజాయ్, కర్బి అంగ్లాంగ్ వెస్ట్, నాగౌన్, కంరూప్ (మెట్రో) జిల్లాల్లో వరదలు పోటెత్తాయని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm