హైదరాబాద్ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆదివారంతో స్వామి వారి జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి వారికి సహస్ర ఘట్టాభిషేకం. మూల మాస్త్ర హావనములు, పూర్ణాహుతి, సహస్ర ఘట్టాభిషేకం జరుగుతాయి. అలాగే సాయంత్రం నృసింహ జయంతి జరుగనుంది. నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు ముగియనున్నాయి. సోమవారం నుంచి సుదర్శన నరసింహ హోమం, నిత్యా, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం తదితర కార్యక్రమాలు పునఃప్రారంభం కానున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm