హైదరాబాద్ : బీజేపీకి ఓటేసి ఒకసారి అవకాశం ఇస్తే.. ఉరేసుకున్నట్టేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పర్యటనపై నారాయణ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీల గురించి అమిత్ షా మాట్లాడలేదు. మహిళా రిజర్వేషన్ల గురించి చెప్పలేదు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో చెప్పలేకపోయారు. కేవలం ఒకసారి ఓటేయండి.. అధికారం ఇవ్వండి అంటున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేస్తోంది. అలాంటి పార్టీకి తెలంగాణలో అవకాశం ఇవ్వడం మంచిది కాదని నారాయణ అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm