హైదరాబాద్ : కేంద్రమంత్రి అమిత్‌షాకు దమ్ముంటే మంత్రి కేటీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్ చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 107 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ సభల్లో ఎక్కడా తెలంగాణ నినాదం వినిపించలేదన్నారు. కేంద్రం ఎక్కడ నిధులు ఇచ్చింది, దేనికి ఇచ్చిందని ప్రశ్నించారు. ఇచ్చిన నిధులు బండి సంజయ్ అకౌంట్‌లో వేశారా? అని అన్నారు. పాకిస్థాన్‌లో ప్రధాని మోడీ టీ తాగి వచ్చారు... అంటే బీజేపీ స్టీరింగ్ పాకిస్థాన్ చేతిలో ఉన్నట్టా? అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.
Mon Jan 19, 2015 06:51 pm