హైదరాబాద్ : పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్ మార్కెట్‌లో సుంగధ ద్రవ్యాలను విక్రయదారులని పెషావర్ పోలీసులు తెలిపారు. మృతులు సల్జిత్ సింగ్ (42), రంజిత్ సింగ్ (38)గా గుర్తించారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుండకుల కోసం గాలించారు.
Mon Jan 19, 2015 06:51 pm