- విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు పిలుపు
నవతెలంగాణ అంబర్ పేట:
విద్యార్థులు మూడ నమ్మకాలు నమ్మవొద్దని, ప్రశ్నించడం నేర్చుకోవాలని జెవివి రాష్ట్ర అధ్యక్షులు ప్రో కోయ వెంకటేశ్వరరావు సూచించారు. జన విజ్ఞాన వేదిక హైదరాబాద్ నగర కమిటి ఆధ్వర్యంలో అంబర్ పేట పటేల్ నగర్ లో నిర్వహించిన "వేసవి సైన్స్ సంబరాలు" ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కోయ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే సమ్మర్ క్యాంప్ లో భాగంగా హైదరాబాద్ లోని పటేల్ నగర్ లో 10 రోజుల పాటు విద్యార్థులు అనేక శాస్త్రీయ అంశాలను నేర్చుకున్నారని, ఇవి వారి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. జెవివి రాష్ట్ర నాయకులు డా.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని కోరారు. సమ్మర్ క్యాంప్ లో నేర్చుకున్న విషయాలను పిల్లలతో చర్చించి, అనేక సూచనలు చేశారు. ఖగోళ శాస్త్ర నిపుణులు రుక్మిణి టెలిస్కోప్ తో పిల్లలకు, కాలనీ ప్రజలకు సూర్యున్ని చూపించి, అనేక విషయాలను తెలియజేశారు. సమ్మర్ క్యాంప్ లో పది రోజుల పాటు నిర్వాహకులుగా విద్యాసాగర్ తో పాటు విక్రమ్, పద్మ వంటి ప్రముఖులు అనేక అంశాల్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం పిల్లలు సర్టిఫికేట్ల తో పాటు అనేక శాస్త్రీయ పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, హైదరబాద్ కమిటి సభ్యులు గోవర్దన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2022 08:21PM