యాదాద్రి: యాదాద్రిలో విషాదం చోటుచేసుకుంది. కొండ కింద ఉన్న గండి చెరువు ప్రాంగణంలో గల లక్ష్మి పుష్కరిణిలో పడి ఓ బాలిక మృతి చెందింది. కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరిణిలో స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బాలిక నీటిలో పడిపోయింది. అయితే ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు హైదరాబాద్ గుడి మల్కాపూర్కి చెందిన బొంతల రోజా(15)గా గుర్తించారు. బాలిక మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. దైవదర్శనానికి వచ్చిన తమకు ఇలా జరిగిందంటూ బాలిక తల్లి రోదించిన తీరు పలువురిని కలచివేసింది.
బాలిక మృతితో లక్ష్మి పుష్కరిణిలో భక్తులకు స్నానం ఆచరించడానికి అనుమతిని ఆలయ అధికారులు నిలిపివేశారు. సంప్రోక్షణ తదుపరి అనుమతిస్తామని వెల్లడించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 May,2022 09:01PM