హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనకనుంచి భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మందికి గాయాలు కాగా, అందులో 10మందికి తీవ్ర గాయాలు కావడంతో, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. భద్రాచలం నుంచి హైదారాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm