హైదరాబాద్ : కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'విక్రమ్'. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. 'అక్కడ అడవి ఉంటే సింహం, పులి, చిరుత వేటకు పోతే..జింక తన ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెడితే..'అంటూ కమల్ వాయిస్ ఓవర్‌తో మొదలైంది ట్రైలర్. విజయ్ సేతుపతి, ఫహద్, కమల్ హాసన్ మధ్య సాగే సీరియస్, యాక్షన్ సన్నివేశాలతో ఉన్న ట్రైలర్ మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. విక్రమ్ ప్రాజెక్టు జూన్ 13 తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
Mon Jan 19, 2015 06:51 pm