హైదరబాద్ : ఉత్తర్ప్రదేశ్ లోని నోయిడాలో డిజిటల్ లైంగికదాడి వెలుగులోకి వచ్చింది. ఏడేండ్ల పాటు 17 ఏండ్ల బాలికపై 81 ఏండ్ల వృద్దుడు డిజిటల్ రేప్ చేశాడన్న ఆరోపణలపై గౌతమ్ బుద్ నగర్ పోలీసులు ఆదివారం అతడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకెళ్తే.. అలహాబాద్ కు చెందిన మౌరిస్ రైడర్ నోయిడాలో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తూ.. పెయింటర్గా పనిచేస్తున్నాడు. అయితే అయితే అతని వద్ద పనిచేసే ఓ వర్కర్ తన కూతురిని చదువు కోసం మౌరిస్ రైడర్ వద్దకు ఏడేండ్ల క్రితం పంపాడు. అయితే అప్పటి నుంచి మౌరిస్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాలిక ఆరోపిస్తోంది. అమ్మాయి మొదట్లో భయపడింది... అయితే తర్వాత అతని లైంగికవేధింపులను ఆడియో ఫైల్‌లుగా రికార్డ్ చేయడం ప్రారంభించింది. ఆమె గణనీయమైన సాక్ష్యాలను సేకరించి, అనుమానితుడితో నివసించిన ఒక మహిళతో తన దుస్థితిని పంచుకుంది, ఆపై ఫిర్యాదు చేసింది అని అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ రణవిజయ్ సింగ్ చెప్పారు. పోలీసులు నిందితుడిపై సెక్షన్ 376, 323, 506తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. డిజిటల్ లైంగికదాడి అభియోగాలు మోపారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు
డిజిటల్ లైంగికదాడి అంటే ఏంటి?
డిజిట్ అంటే ఆంగ్లంలో అంకె అని అర్థం. ఇంగ్లిష్ డిక్షనరీలో శరీర భాగాలకు కూడా నంబర్లు ఉంటాయి. అందుకే డిజిట్, రేప్ కలిపి డిజిటల్ రేప్ అని పేరు పెట్టారు. డిజిటల్ రేప్ అంటే బాధితురాలి జననాంగంలోకి నిందితుడు చేతి వేళ్లు, కాలి వేళ్లు లేక వస్తువులను చొప్పించడం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 11:50AM