హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టెంపుల్ వద్ద ఓ పసి బాలుడిని కిడ్నాప్ చేశారు. 28 రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన లావణ్య.. గత నాలుగు రోజుల నుంచి తన ఇద్దరు కుమారులతో కలిసి టెంపుల్ వద్ద ఉంటోంది.
లావణ్య ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆదివారం రాత్రి ఆమెకు మద్యం తాగించారు. నిద్రలోకి లావణ్య జారుకోగానే, 28 రోజుల బాబుని కిడ్నాప్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబు ఆచూకీ కోసం అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 11:54AM