న్యూఢిల్లీ : నేడు బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాల్ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ సోమవారం నేపాల్ చేరుకున్నారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని ప్రధాని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇక్కడ ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆయన లుంబినీ కి వెళ్తారు. లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలం. లుంబినీ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో మోడీ పాల్గొంటారు. లుంబిని లో బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి మన దేశం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ నేపథ్యంలో వారసత్వ కేంద్రం నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు ఇరు దేశాల కు సంబంధించిన ఐదు అవగాహన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి. బుద్ధ పౌర్ణిమ నాడు నేపాల్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్వీట్ చేవారు.
Mon Jan 19, 2015 06:51 pm