హైదరాబాద్ : 'ఓఎల్ఎక్స్ లో కారు అమ్మబడును' అన్న ప్రకటన చూశాడు. విక్రయదారుడిని కలిశాడు. కారు టెస్ట్ డ్రైవ్ చేస్తానని చెప్పి ఆగకుండా వెళ్లిపోయాడు. పోలీసులు అతడిని ఎంతో నైపుణ్యంతో పట్టుకున్నారు. బెంగళూరు కాఫీ బోర్డు లే అవుట్ నివాసి రవీంద్ర ఎల్లూరి (47) తన మారుతి విటారా బ్రెజ్జా కారును విక్రయించనున్నట్టు ఓఎల్ఎక్స్ లో యాడ్ పెట్టాడు. మొత్తం ఐదుగురి నుంచి స్పందన వచ్చింది. వీరిలో చక్కబళ్లాపుర, అమృత్ నగర్ నివాసి ఎంజీ వెంకటేశ్ నాయక్ కూడా ఉన్నాడు. నాయక్ వెళ్లి ఎల్లూరిని కలిశాడు. టెస్ట్ డ్రైవ్ చేస్తానంటే కీ ఇచ్చాడు. అంతే... ఇంజన్ స్టార్ట్ చేసిన నాయక్ తిరిగి రాకుండా అదృశమయ్యాడు. దీంతో మోసమని గుర్తించిన ఎల్లూరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు నిందితుడిని గుర్తించేందుకు ఓఎల్ఎక్స్ టీమ్ ఇచ్చిన 2,500 ఐపీ చిరునామాలను పరిశీలించారు. చివరికి మే 10న అతడ్ని గుర్తించారు. నేరాన్ని అంతడు అంగీకరించాడు. తన భార్య గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఎంతో డబ్బును 2020 డిసెంబర్ లో నష్టపోయినట్టు అతడు చెప్పాడు. అప్పులు తీర్చేందుకు తన విటారా బ్రెజ్జాను విక్రయించాడు. కారు లేకుండా వెంకటేశ్ నాయక్ ఊరిలో తలెత్తుకు తిరిగలేకపోయాడు. ఎల్లూరి విక్రయానికి పెట్టింది కూడా అచ్చం అదేమాదిరి కారు కావడంతో కొట్టేయాలన్న ప్రణాళిక మేరకు అతడు ఈ పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 01:01PM