హైదరాబాద్: హైదరాబాద్ లోని నాగోల్‌లో బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ ఫూల్‌లో ఆదివారం మనోజ్ అనే ఓ బాలుడు ఈత కొడుతూ మునిగి చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ స్విమ్మింగ్ ఫూల్ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. సోమవారం స్విమ్మింగ్ ఫుల్‌కు చేరుకున్న జీహెచ్ఎంసీ అధికారులు దానికి ఎలాంటి అనుమతులు లేవని తేల్చారు. ఈ మేరకు స్విమ్మింగ్ ఫుల్‌ను సీజ్ చేశారు. ఇప్పటికే స్విమ్మింగ్ ఫుల్ నిర్వాహకుడు అశోక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
స్విమ్మింగ్ ఫూల్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాలుని మృతికి కారణమైన నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నాగోల్‌లోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ ఫుల్ ముందు మృతుడి తల్లిదండ్రుల ఆందోళనకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 01:08PM