Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM
— Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022
హైదరాబాద్ : నటీనటులకు ఫ్యాన్ ఫాలొయింగ్ ఎంతుంటుందో తెలిసిందే. వారు గనుక బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే అభిమానులు చుట్టుముట్టేస్తారు. ఆ భయంతోనేనేమో తాజాగా నటి సాయి పల్లవి సిక్రెట్ గా సినిమా థియేటర్ కు వచ్చేసి సినిమా చూసి వెళ్లింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి కీర్తి సురేష్ లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమానే నటి సాయిపల్లవి ఆదివారం సిక్రెట్ గా హైదరాబాద్‌లోని పీవీఆర్ ఆర్‌కే కాంప్లెక్స్‌లో చూసింది. ఆమె తన ముఖానికి స్కార్ఫ్ అడ్డుపెట్టుకొని, చేతిలో బ్యాగ్ తో కనిపించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరలవుతోంది.