హైదరాబాద్ : ఈ ఏడాది మే 3న చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి మార్గ మధ్యంలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ డా. శైలజాభట్ దీనిపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. భక్తులు అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలతో అనారోగ్యానికి గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని తెలిపారు. పర్వతం ఎక్కడం వలన అలసట చెందడం తదితర కారణాలతో యాత్రికులు మరణిస్తున్నారని చెప్పారు. అందుకని వైద్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాత్రికులు చార్ ధామ్ యాత్రలో ప్రయాణించవద్దని వారు కీలక సూచన చేశారు. అలాగే వైద్య పరీక్షల తర్వాతే ప్రయాణం ప్రారంభించాలన్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, రక్తపోటు ఉన్న రోగులు కూడా ఎత్తైన ప్రదేశాలకు ప్రయాణించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm