డెహ్రాడూన్ : చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ యాదవ్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరిగిన జీన్స్ ధరించడం భారతీయ సంస్కృతిలో భాగం కాదని అన్నారు. చిరిగిన జీన్స్ ధరించే మహిళలపై ఆయన గతేడాది చేసిన విమర్శలపై తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నానని తాజాగా చెప్పారు.
2021 మార్చిలో తీరత్ సింగ్ యాదవ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత యువతులు వింత ఫ్యాషన్ ట్రెండ్‌లను అనుసరిస్తారని వ్యాఖ్యానించారు. చిరిగిన జీన్స్,బూట్లు ధరించి ఉన్న ఓ తల్లిని చూసి తాను షాక్ అయ్యానని తెలిపారు. చిరిగిన జీన్స్ ధరించిన మహిళల వల్ల వారి పిల్లలు కూడా వారిని అనుసరిస్తారని, ఇంట్లో పిల్లలకు సరైన సంస్కారం నేర్పాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే జీన్స్‌తో తనకు ఎటువంటి సమస్య లేదని, చిరిగిన జీన్స్ ధరించడం సరైనది కాదని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 01:47PM