లక్నో : ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జ్ఞానవాపి మసీదు ఆవరణలో ఉన్న బావిలో సోమవారం శివలింగం కనిపించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల ప్రకారం జ్ఞానవాపి - శృంగార్ గౌరీ దేవి కాంప్లెక్స్ వద్ద వీడియో సర్వే నిర్వహించగా శివలింగం బయటపడింది. అయితే శివలింగాన్ని పరిరక్షించాలని కోరుతూ సర్వేలో పాలు పంచుకున్న న్యాయవాద బృందంలో ఒకరై విష్ణు జైన్.. సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దాంతో సంబంధిత బావిని సీజ్ చేసి కట్టుదిట్టమైన రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ ఒక్కరినీ అక్కడకి అనుమతించొద్దని జిల్లా కలెక్టర్ కౌషల్ రాజ్ శర్మను ఆదేశించింది. జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, సీఆర్పీఎఫ్ వారణాసి విభాగం సంబంధిత ప్రాంత భద్రత బాధ్యత తీసుకోవాలని ఆదేశించింది.
ఇదిలా ఉండగా కోర్టు ఆదేశాలను అనుసరిస్తామని మసీదు నిర్వహణ కమిటీ జాయింట్ సెక్రటరీ యాసిన్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 02:47PM