హైదరాబాద్: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి భారత్ బయోటెక్ భారీ విరాళాన్ని అందజేసింది. ఆలయంలో కొనసాగుతున్న నిత్యన్నదానానికి భారత్ బయోటెక్ యాజమాన్యం రూ.1 కోటిని అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు సోమవారం భద్రాద్రి ఆలయ ఖాతాకు రూ.1 కోటి విరాళాన్ని బదిలీ చేశారు. భద్రాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతి రోజు అన్నదాన సత్రంలో అన్న ప్రసాదాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నదానం కోసమే భారత్ బయోటెక్ కోటి రూపాయల విరాళాన్ని అందజేసింది.
Mon Jan 19, 2015 06:51 pm