హైదరాబాద్ : ట్రాఫిక్ చలాన్ ల అప్ డేట్ లను ఇకపై వాట్సాప్ కు కూడా పంపనున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. ఈ మేరకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. వాహన యజమానులు వాహనాలను రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నివాస చిరునామా వివరాలు, ఫోన్ నంబర్‌ను ఇస్తారు. దాంతో వాహనాదారులు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు సంబంధించిన చలాన్ సందేశాన్ని వారి వాట్సాప్‌కు కూడా ఫార్వార్డ్ చేస్తామని సీనియర్ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ఈ-చలాన్ విభాగంలోని పోలీసుల బృందం ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ-చలాన్ పోర్టల్‌లో ట్రాఫిక్ జరిమానాలను అప్‌డేట్ చేస్తుంది. దాని తర్వాత వాహన యజమాని మొబైల్ ఫోన్‌కు ముందుగా మెసేజ్ పంపి, తర్వాత పోస్టల్ చలాన్ కూడా పంపిస్తారు. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా చలానాను పంపనున్నారు. ఆన్‌లైన్‌లో లేదా ట్రాఫిక్ కాంపౌండింగ్ బూత్ లేదా మీసేవలో పెండింగ్ చలాన్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 May,2022 03:02PM