దావోస్ : తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్ చేరుకోనున్నారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈ రాత్రికి దావోస్కి చేరుకుంటారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో మంత్రి కేటీఆర్ సమావేశమవుతారు.
Mon Jan 19, 2015 06:51 pm