హైదరాబాద్ : ఆస్ట్రేలియా నూతన ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ బాధ్యలు స్వీకరించారు. సోమవారం ఉదయం కాన్‌బెర్రాలో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో 31వ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. వెంటనే ఆయన జపాన్‌లోని టోక్యోకు పయణమయ్యారు. మంగళవారం నుంచి టోక్యోలో క్వాడ్ సదస్సు జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని మోడీ, అమెరికా, జపాన్ అధినేతలతో సమావేశం కానున్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచంతో చర్చించేందుకు ఆస్ట్రేలియా సుముఖంగా ఉందని ఆల్బనీస్ వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm