అమరావతి : ఏపీలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతన్ని వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేశాడని ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఆ నేరాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు ఒప్పుకున్నాడు. పోలీసులు ఆదివారం రాత్రి ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో డీఐజీ పాలరాజు సమక్షంలో విచారించారు. ఈ విచారణలో భాగంగా జరిగిన ఘటన వివరాలను ఎమ్మెల్సీ వివరించాడు. తన వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నందుకే తాను ఒక్కడినే అతడిని హ చేశానని ఎమ్మెల్సీ అనంతబాబు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఎమ్మెల్సీ అరెస్ట్ వివరాలను డీఐజీ అధికారికంగా సాయంత్రం వెల్లడిస్తారని పోలీసు అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm