హైదరాబాద్ : 60 ఏండ్ల నాటి ఓ బీమా సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ర్టంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఈ క్రమంలో 160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్విస్ రే కంపెనీకి ఘన స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ 250 మందితో తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని చెప్పారు. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్ పై దృష్టి సారించనుందని చెప్పారు. అలాగే స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 03:13PM