సతారా: దేశంలో ఎలక్ట్రిక్ బైక్ లతో ప్రమదాలు ఆగడం లేదు. తాజాగా ఓ యువతి ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ కొట్టి మృతి చెందింది. ఈ ఘటన మహారాష్ట్ర సతారా జిల్లా కరాడ్ మండలం మోప్రోలో ఆదివారం చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. కరాడ్‌లోని మోప్రే గ్రామానికి చెందిన శివానీ అనిల్ పాటిల్ కుటుంబసభ్యులు కొంతకాలం క్రితం ఈ-బైక్ కొనుగోలు చేశారు. శివానీ ఆ బైక్ ను ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఊరు బయటకు వెళుతుండగా శివాని ద్విచక్రవాహనం బ్యాటరీ చార్జింగ్‌ను పరిశీలించింది. ఛార్జింగ్ తక్కువగా ఉందని గమనించిన ఆమె... బైక్ బ్యాటరీని తీసి చార్జింగ్ పెట్టేందుకు ఇంట్లోకి వెళ్లింది. అయితే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే క్రమంలో శివాని షాక్‌కు గురై కుప్పకూలింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందేలోపే ఆమె పరిస్థితి విషమించి మృతి చెందింది. ఈ ఘటనపై కరాడ్ గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం రాత్రి శోకసంద్రమైన వాతావరణంలో శివాని అంత్యక్రియలు జరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 03:21PM