హైదరాబాద్ : దాదాపు 30 ఏండ్ల క్రితం నాటి కేసులో భారత జట్టు మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకి సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాటియాలా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయనను తాజాగా ఆస్పత్రికి తరలించారు. ఆయన జైల్లో అందిస్తున్న ఆహారాన్ని తీసుకోవడం లేదు. తొలి రోజు రాత్రి రోటి, పప్పు వడ్డించగా... గోధుమల అలర్జీ, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా వాటిని ఆయన వద్దన్నారు. కాలేయ వ్యాధి, రక్తం గడ్డకట్టడం వంటి అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన తరపు లాయర్ పాటియాలా కోర్టును ఆశ్రయించారు. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో సిద్ధూకి ప్రత్యేక ఆహారాన్ని అందించాలని కోర్టుకు విన్నించారు. ఈ క్రమంలో వైద్య పరీక్షల నిమిత్తం సిద్ధూని జైలు నుంచి ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm