హైదరాబాద్ : ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు. అయితే ఆయన పర్యటనపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ వస్తున్నాడని ప్రశ్నించారు. తెలంగాణకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. విభజన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. పెట్రో ధరలు ఎందుకు పెంచారు.. ఎందుకు తగ్గించారన్నారు. ఈ సీజన్ లో ఉపాధి పనిదినాలను కేంద్రం 4 కోట్లు తగ్గించిందని మంత్రి తెలిపారు. 16 కోట్ల పనిదినాలు ఇవ్వాలని తీర్మానం చేశామని చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరికీ భయపడే వ్యక్తి కాదని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాకతీయ సామ్రాజ్యం గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. కులాలను పట్టి ప్రజలు ఓట్లు వేయరని.. అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారని చెప్పారు. ఉపాధిహామీని సాగుకు అనుసంధానించాలని మళ్లీ తీర్మానం చేశామన్నారు. పట్టణాల్లోనూ ఉపాధిహామీ అమలు చేయాలని తీర్మానించామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 03:50PM