ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 37 పాయింట్లు కోల్పోయి 54,288కి పడిపోయింది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 16,214 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ అండ్ టీ, ఏసియన్ పెయింట్స్ లు లాభాలు గడించాయి. టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐటీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ లు నష్టాలను మూటగట్టుకున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm