హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ఓయో రూంలో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. వివరాల్లోకెళ్తే.. సాయికృష్ణ అనే యువకుడు ఓయో రూంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు విషయాన్ని ఫోన్ చేసి తన కుటుంబసభ్యులకు చెప్పాడు. దాంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పురుగుల మందు తాగిన ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు జరుపుతున్నారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm