టక్యో : భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో జపాన్ కీలక పాత్ర పోషించిందని భారత ప్రధాని మోడీ అన్నారు. జపాన్‌తో తమ సంబంధం ఆధ్యాత్మికత, సహకారానికి సంబంధించినదని.. భారతదేశం మరియు జపాన్ సహజ భాగస్వాములు అన్నారు. టోక్యోలో సోమవారం భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రధాని మోడీ మాట్లాడారు. తాను జపాన్‌కు వచ్చినప్పుడల్లా ఇక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమను పొందుతానన్నారు. మీలో కొందరు ఏండ్ల తరబడి జపాన్‌లో ఉంటూ ఈ దేశ సంస్కృతిని అలవర్చుకున్నారని చెప్పారు. అయితే ఇప్పటికీ మీలో భారతీయ సంస్కృతి, భాష పట్ల అంకితభావం నానాటికీ పెరుగుతూనే ఉందన్నారు. మీరు ఈ దేశంలో నివసించడం ద్వారా భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేస్తున్నారని చెప్పారు. స్వామి వివేకానంద చికాగోకు వెళ్లకముందే జపాన్‌కు వస్తే ఆ దేశం ఆయన మనసులో పెద్ద ముద్ర వేసిందన్నారు.
ఈ రోజు ప్రపంచం బుద్ధ భగవానుడు చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని సూచించారు. హింస, అరాచకం, తీవ్రవాదం, వాతావరణ మార్పు వంటి ప్రపంచం ఎదుర్కొంటున్న అన్ని సవాళ్ల నుండి మానవాళిని రక్షించడానికి ఇదే మార్గం అన్నారు. భారతదేశం ప్రతి పౌరుడి హక్కులను సమర్థిస్తోందన్నారు. తాము భారతదేశంలో బలమైన, దృఢమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 06:13PM