🛫 Based on a true experience! 😂#RoyalsFamily | #HallaBol pic.twitter.com/p5KSFH09CB
— Rajasthan Royals (@rajasthanroyals) May 22, 2022
ముంబై : ఐపీఎల్ లో మంగళవారం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్ 1 ఆడేందుకు ముంబై నుండి కోల్‌కతాకు వెళుతున్న రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లకు ఊహించని పరిణామం ఎదురైంది. వారు వెళ్తున్న విమానం గాల్లో ఉన్న సమయంలో దట్టమైన పొగమంచు విమానంలోకి వచ్చింది. దాంతో విమానంలో ఉన్న ఆటగాళ్లు కాసేపు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఆటగాళ్లు భయంతో కేకలు కూడా వేశారు. (భాయ్, ల్యాండ్ కరా దే) విమానాన్ని ల్యాండింగ్ చేయాలని ఒక వ్యక్తి అరిచాడు. అయితే కాసేపటి తర్వాత పొగమంచు క్లియర్ కావడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం కోల్ కతాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. కొన్ని రోజులుగా కోల్ కతా ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో మేఘాల్లో నుంచి విమానం దూసుకుపోవడంతో విమానంలోకి పొగమంచు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.