హైదరాబాద్ : అశోక్ లేలాండ్ వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టడంతో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో సోమవారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. .ఐరన్ పైపుల లోడుతో వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం పెద్దకాపర్తి శివారులో 65వ జాతీయ రహదారి పై అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm