పూణె : ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లు ముగియడంతో ఆ టోర్నీకి కాస్త బ్రేక్ దొరికింది. అయితే నేటి నుంచి మహిళల టీ20 ఛాలెంజ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మూడు జట్లు పోటీ పడబోతున్నాయి. అవి ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్, వెలాసిటీ. అందులో భాగంగా సోమవారం తొలి మ్యాచ్ ట్రయల్‌బ్లేజర్స్, సూపర్‌నోవాస్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన సూపర్ నోవాస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ఎంచుకుంది.
సూపర్ నోవాస్ (ప్లేయింగ్ XI): డియాండ్రా డాటిన్, ప్రియా పునియా, సునే లూస్, హర్మన్‌ప్రీత్ కౌర్(c), హర్లీన్ డియోల్, తానియా భాటియా(w), సోఫీ ఎక్లెస్టోన్, అలానా కింగ్, వి చందు, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్
ట్రయల్ బ్లేజర్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన(c), జెమిమా రోడ్రిగ్స్, పూనమ్ యాదవ్, హేలీ మాథ్యూస్, సోఫియా డంక్లీ, రాజేశ్వరి గయాక్వాడ్, అరుంధతీ రెడ్డి, సల్మా ఖాతున్, రేణుకా సింగ్, రిచా ఘోష్(w), షర్మిన్ అక్తర్