హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో ఓ తహసీల్దార్ లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాల్లోకెళ్తే.. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని అకినపల్లి గ్రామానికి చెందిన రైతు పెద్దంపేట్ శంకర్ తన భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే భూమి సర్వే చేయాలంటే మూడు లక్షల రూపాయల వరకు అవుతుందని శంకర్‌కు ఆర్‌ఐ అజీమ్ చెప్పాడు. అనంతరం లక్ష రూపాయలు ఒప్పందం కుదిరింది. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల మేరకు లక్ష రూపాయలను మధ్యవర్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు తాసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు
Mon Jan 19, 2015 06:51 pm