ముంబై : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతుండడంతో దేశంలోని ముంబైలో అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు నగరంలోని కస్తుర్బా ఆస్పత్రిలో 28 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేసింది. మంకీపాక్స్ అనుమానిత రోగులను ఈ వార్డులో ఐసోలేషన్‌లో ఉంచనున్నట్లు బీఎంసీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
అయితే, ఇప్పటి వరకు మంకీపాక్స్ సోకినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని సదరు అధికారి పేర్కొన్నారు.
ఇక అనుమానిత రోగుల నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కు పంపనున్నట్లు బీఎంసీ పేర్కొంది. అలాగే ముంబైలోని ఆస్పత్రులతో పాటు ఆరోగ్య సంస్థలకు మంకీపాక్స్‌కు సంబంధించి అనుమానిత రోగులు వస్తే వెంటనే కస్తూర్బా ఆస్పత్రికి సమాచారం అందించాలని ఆదేశించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 May,2022 07:37PM