హైదరాబాద్ : పోలవరంపై ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం కాసేపటి క్రితం లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ టెండర్‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కృష్ణా బేసిన్ నుంచి నీటిని ఇతర బేసిన్లకు తరలించడం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినట్టవుతుందని పేర్కొన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోవద్దని కోరారు. 2014 తర్వాత చేపట్టే ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడే ఉండాలని తెలిపారు. టెండర్లను ఏపీ కొనసాగించకుండా ఆపాలని కేఆర్‌ఎంబీని ఈఎన్‌సీ కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm