జకార్తా : ఇండోనేషియాలోని జరుగుతున్న హాకీ ఆసియా కప్ లో భాగంగా సోమవారం భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో మొదటి క్వార్టర్ లోనే భారత ఆటగాడు కార్వీ సెల్వమ్ గోల్ సాధించాడు. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో చివరి వరకు భారత్ గెలిచేలా కనిపించింది. కానీ నాలుగో క్వార్టర్ లో పాక్ ఆటగాడు అబ్దుల్ రాణా పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఇరుజట్లు మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ 1-1తో డ్రా అయింది.భారత్ తన తర్వాతి మ్యాచ్ ను మంగళవారం జపాన్ తో ఆడనుంది.
Mon Jan 19, 2015 06:51 pm