లక్నో : ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కానిస్టేబుల్ తన ప్రియురాలిని నమ్మించి శారీరికంగా దగ్గరాయ్యాడు. అనంతరం ముఖం చేటేశాడు. దాంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకెళ్తే.. ముజాఫర్‌నగర్ జిల్లాలోని దోల్రా గ్రామానికి చెందిన విక్రాంత్ కాన్పూర్ దీహత్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను ఓ యువతిని పెండ్లి చేసుకుంటానని నమ్మబలికి శారీరకంగా దగ్గరయ్యాడు. అనంతరం యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా ముఖం చాటేశాడు. దాంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఆదివారం అతన్ని షామ్లీలో పోలీసులు అరెస్టు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm