హైదరాబాద్: యువజన అభ్యుదయ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం తెలంగాణ సాహిత్య అకాడమీని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్ ను వారు కలిశారు. సాహిత్య అకాడమి భవిష్యత్తులో చేయవలసిన కార్యక్రమాలపై ఇరువురు కలిసి చర్చించారు. తెలంగాణ సాహిత్యాన్ని విస్తృతంగా స్కూలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు, చేరవేసేందుకు కృషి చేయాలని మాట్లాడారు.
Mon Jan 19, 2015 06:51 pm